రకుల్‌ ప్రీత్ సింగ్‌ను ఏకేసిన శ్రీరెడ్డి.. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు..

ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (12:16 IST)
దేశవ్యాప్తంగా గతంలో మీటూ రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారంపై రచ్చ రచ్చ జరుగుతోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి తర్వాత డ్రగ్స్ వ్యవహారం అతడి ప్రియురాలు రియా చక్రవర్తి కారణంగా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ వాడే నటుల జాబితాను ఆమె సీబీఐకి ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఆ జాబితాలో రకుల్ ప్రీత్‌పై నటి శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. 
 
రకుల్ ప్రీత్ సింగ్‌కు ఆట మొదలైందంటూ ఫేస్ బుక్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి మాట్లాడుతూ.... గతంలో తాను టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు రకుల్ టాలీవుడ్‌లో అలాంటివేమీ లేవని వ్యాఖ్యానించిందని తెలిపింది. టాలివుడ్‌లో డ్రగ్స్ వాడే కల్చర్ కూడా లేదని రకుల్ మాట్లాడినట్టు గుర్తు చేసింది. అంతేకాకుండా అప్పట్లో రకుల్ కాండిల్ ర్యాలీలతో పత్తిత్తులా మాట్లాడిందని గుర్తు చేసింది. 
 
మరోవైపు టాలీవుడ్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తారా అంటూ మంచు లక్ష్మి సైతం వ్యాఖ్యానించిందని తెలిపింది. తనపై కామెంట్లు చేసిన వారికి ఇప్పుడు తెలుస్తుందని కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తనను విమర్శించినవారు కొందరు కరోనా బారిన పడ్డారు కూడా అని చెప్పుకొచ్చింది. త్వరలోనే ఒక్కొక్కరి రంకు బాగోతాలు బయటపడతాయని వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు