బొంభాట్ టీజర్ రిలీజ్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్

గురువారం, 26 నవంబరు 2020 (19:49 IST)
అమెజాన్ ప్రైమ్ వీడియో బొంభాట్ టీజర్‌ను ఆవిష్కరించింది. ఈ చిత్రం టెక్నాలజీ మరియు లవ్ బ్యాక్ డ్రాప్‌తో సాగుతుంది. రాఘవేంద్ర వర్మ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాను విశ్వాస్ హన్నూర్కర్, సుచేత డ్రీమ్‌వర్క్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుశాంత్, చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రల్లో నటించారు.
 
బొంభాట్ డిసెంబర్ 3న గ్లోబల్ వరల్డ్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. భారతదేశంలోని ప్రైమ్ మెంబర్స్ మరియు 200కి పైగా దేశాలు, ప్రాంతాలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ తెలుగు చిత్రాన్ని ప్రసారం చేయగలవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు