అవినాష్ ఏంటిది? చేతులేయడం ముద్దు పెట్టించుకోవడం..

గురువారం, 3 డిశెంబరు 2020 (15:59 IST)
బిగ్ బాస్ షోలో ఇప్పుడు ప్రధానంగా ముగ్గురి పైనే చర్చ జరుగుతోంది. అందులో మొదటిది అఖిల్, ఆ తరువాత మోనాల్, ఇక మూడవది అవినాష్. అఖిల్, మోనాల్ బాగా క్లోజ్‌గా ఉన్నారు. వీరిద్దరే కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. 
 
టాస్క్‌లో బాగా ఆడాలంటూ మోనాల్ అఖిల్‌ను ప్రోత్సహిస్తోంది. అఖిల్ అంటే బాగా మోనాల్‌కు ఇష్టంగా ఉందని అభిమానులు అనుకుంటున్నారు. అయితే నిన్న అఖిల్‌ను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించాలనుకున్నాడు అవినాష్. మోనాల్ భుజంపై చేతులేశాడు. అంతకు ముందే మోనాల్ అవినాష్‌కు ముద్దు ఇవ్వడంతో ఇక రెచ్చిపోవడం ప్రారంభించాడు అవినాష్. అఖిల్‌ను మానసికంగా క్రుంగదీస్తే ఓడిపోతాడన్న ఉద్దేశంతో అలా చేయడం ప్రారంభించాడు. 
 
అందుకే మోనాల్ భుజంపై చేతులు వేస్తూ అఖిల్ మోనాల్ నీకు సోదరి కదా అన్నాడు. దీంతో అఖిల్ సైలెంట్‌గా ఉన్నాడు గానీ ఉన్నట్లుండి కోపం వచ్చి నీ సోదరి మోనాల్ అన్నాడు. దీనికి మోనాల్ కూడా అవినాష్ మా అన్న అనేసింది. దీంతో అవినాష్ షాకయ్యాడు. నిన్నే ముద్దు పెట్టి అన్నయ్య అని పిలిస్తే ఎలా అంటూ ముఖం పెట్టాడు అవినాష్. తన నోటి దురుసుతో ఇంకా హౌస్‌లో ఉన్న వారి దగ్గర మాటలు అనిపించుకుంటున్నాడు అవినాష్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు