నందిని రాయ్‌ ఫోటోలు నెట్టింట వైరల్..

సోమవారం, 7 సెప్టెంబరు 2020 (21:21 IST)
Nandini Roy
మాయ, మోసగాళ్లకి మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని సినిమాల్లో కనిపించిన నందినీ రాయ్‌కి నటిగా సరైన గుర్తింపు రాలేదు. ఇటీవల ఆహాలో రిలీజైన మెట్రో కథలు సినిమాలో నందినీ రాయ్ నటించింది. జర్నలిస్ట్ ఖదీర్ బాబు రాసిన కథలతో తెరకెక్కించిన ఈ నాలుగు కథల మెట్రో కథలు సినిమాలో ఒకానొక పాత్రలో కనిపించింది. అందులో ఆమె పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
లాంగ్ డిస్టేన్స్ రిలేషన్ షిప్స్ పెళ్లయిన వారిని ఏ విధంగా ఇబ్బంది పెడతాయని చక్కగా చూపించారు. భర్త కెరీర్ బిల్డప్ చేసుకునే పనిలో భార్యని అంతగా పట్టించుకోకుండా తిరిగితే ఆ భార్య ఎలాంటి ఇబ్బందులని ఎదుర్కొన్నదనేది చాలా బాగా చూపించారు. భార్యగా నందినీ చాలా చక్కగా చేసిందని ప్రశంసలు దక్కాయి.
 
ఇప్పుడిప్పుడే నటిగా మంచి అవకాశాలు దక్కించుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్ అప్డేట్లతో అభిమానులతో టచ్‌లో ఉంటుంది. మత్తెక్కించే ఫోటో షూట్లతో సోషల్ మీడియా ఫాలోవర్లని పెంచుకుంటూ వెళ్తుంది. బిగ్ బాస్ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిని.. తాజాగా ఆమె ఫాలోవర్లతో పంచుకున్న ఫోటో వైరల్ అయ్యింది. మైమరిపించే సొగసుతో అందాలని ఆరబోస్తూ అందరినీ కనువిందు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు