డియర్ శివాత్మిక... మీ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నా: చిరంజీవి ట్వీట్

గురువారం, 22 అక్టోబరు 2020 (13:56 IST)
కరోనావైరస్ బారిన పడిన రాజశేఖర్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఈ రోజు తన తండ్రి ఆరోగ్యం గురించి ట్విట్టర్లో పేర్కొన్నారు.

త‌న తండ్రి క్షేమంగా రావాల‌ని , ఇందుకోసం అంద‌రు ప్రార్ధ‌న‌లు చేయండని శివాత్మిక చేసిన ట్వీట్‌కు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, డియ‌ర్ శివాత్మిక.. మీ నాన్న‌, నా స్నేహితుడు రాజ‌శేఖర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నా. మీరు ధైర్యంగా ఉండండి. అంద‌రి ప్రార్థన‌ల‌తో రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకుంటారు. మీ కుటుంబం కోసం ప్రార్ధిస్తున్నాను అని చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
మరోవైపు రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ట్విట్టర్ వేదికగా ఇలా రాసారు. " ప్రియమైన అందరికి... కోవిడ్‌తో నాన్న పోరాటం చాలా కష్టంగా వుంది, అయినప్పటికీ ఆయన దానితో గట్టిగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనల ప్రేమ మరియు దీవెనలు మమ్మల్ని రక్షిస్తున్నాయి. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని నేను ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను! మీ ప్రేమతో, ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారు". మళ్లీ ఆ తర్వాత కొద్దిసేపటికి తన తండ్రి ఆరోగ్యం బాగానే వున్నదనీ, మరీ ఆందోళన చెందాల్సినదేమీ లేదంటూ ట్వీట్ చేసారు.
 

Dear @ShivathmikaR Wishing your loving dad and my colleague and friend #DrRajashekar a speedy recovery. All our best wishes and prayers are with him and your family. Stay Strong. https://t.co/7vorNZ8VMK

— Chiranjeevi Konidela (@KChiruTweets) October 22, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు