బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ మృతి..

ఆదివారం, 19 జులై 2020 (12:15 IST)
Rajat Mukherjee
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ ప్రాణాలు కోల్పోయారు. ఈయన దర్శకత్వం వహించిన రోడ్ మూవీకి ప్రస్తుతం డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన రజత్ ముఖర్జీ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
ఆదివారం ఆయన ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారని ప్రకటించారు. కాగా 'రోడ్‌, ప్యార్ తూనే క్యా కియా, లవ్ ఇన్ నేపాల్‌' వంటి చిత్రాలతో రజత్ ముఖర్జీ మంచి గుర్తింపు సంపాదించారు. 
 
రజత్ ముఖర్జీ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్‌లో ట్వీట్లు పెడుతున్నారు. రజత్ ముఖర్జీ మృతి పట్ల నటుడు మనోజ్ బాజ్‌పాయి ట్విట్టర్‌లో సంతాపం వెల్లడించారు. తన స్నేహితుడు, రోడ్ దర్శకుడు రజత్ జైపూర్‌లో కన్నుమూశారని, ఆయన ఆత్మకు శాంతికలగాలని పోస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు