డ్రగ్స్ కేసు: రాగిణి-సంజనా కలబడుకుంటున్నారా?

ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (20:05 IST)
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం మడివాడ మహిళా సంరక్షణ కేంద్రంలో ఉన్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు పరస్పరం బాహాబాహీకి దిగుతున్నట్టు తెలుస్తోంది. తాను అరెస్ట్ అయినందుకు నువ్వే కారణమంటూ సంజన, కాదు... నువ్వే కారణమంటూ రాగిణి పోట్లాడుకుంటున్నట్టు సమాచారం.
 
ఇదిలావుండగా, గతంలో డ్రగ్స్ తీసుకున్నారా? అనే విషయాన్ని తేల్చేందుకు రాగిణి మూత్రాన్ని సేకరించాలన్న ఆలోచనలో ఉన్న అధికారులు, ఆమెను కోరగా, చిన్న సీసాలో, తాగే నీటిని తెచ్చి ఇచ్చిందని, ఆపై విషయం తెలుసుకున్న అధికారులు, ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు, మహిళా కానిస్టేబుల్‌ను పంపి, మరోసారి యూరిన్ సేకరించారు.
 
ఇదే కేసులో అరెస్ట్ అయిన రాహుల్, ప్రశాంత్ రంగా, ప్రతీశ్ హెట్టి, రాహుల్, నియాజ్ తదితరులను వైద్య పరీక్షల నిమిత్తం కేసీ జనరల్ ఆసుపత్రికి తరలించారు. వారి రక్తంతో పాటు తల వెంట్లుకలు, మూత్రం తదితరాల నమూనాలను సేకరించారు. రాగిణికి సన్నిహితుడిగా గుర్తింపు పొందిన బంగారం వ్యాపారి వైభవ్ జైన్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి, పరీక్షల నిమిత్తం పంపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు