మీ దయ నాకు అక్కర్లేదు.. మీ కుటుంబాలను చూసుకోండి.. వనిత

శనివారం, 31 అక్టోబరు 2020 (12:09 IST)
కోలీవుడ్‌లో వనిత విజయ్ కుమార్ పేరు మారుమోగుతోంది. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. వనిత చేసుకున్న మూడో పెళ్లిపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.. 40 ఏళ్ల వయసులో మూడో పెళ్ళి చేసుకొని వార్తల్లో నిలిచింది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో క్రిస్టియన్ వివాహ పద్ధతిలో ఆమె పీటర్ పాల్ అనే వక్తిని జూన్ లో మూడో పెళ్లి చేసుకుంది. 
 
వనిత-పీటర్ పాల్ జంటపై పీటర్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో విడాకులు కాకుండానే పీటర్ మరో వివాహం చేసుకున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని పెళ్లిచేసుకుందని వనితపై చాలామంది విమర్శలు కురిపించారు. తనపైన విమర్శలు చేసిన వారికి వనిత కూడా గట్టిగానే సమాధానం చెప్తూ వచ్చింది. కొందరిపైన కేసు కూడా పెట్టింది. ఇలా రోజుకొక వివాదంతో మీడియాలో ఎక్కువగాఉంటూ వచ్చింది వనిత.
 
ఈ క్రమంలో తన మూడో భర్తను కూడా తన్నితరిమేసిందని వార్తలు షికారు చేసాయి. ఇటీవల ఈ జంట గోవా ట్రిప్‌కు వెళ్లారట ..ఆ ట్రిప్‌లో మద్యం తాగి పీటర్ వనితని కొట్టాడని టాక్. చెన్నైకి రాగానే వనిత కోపంతో పీటర్ ఇంటి నుంచి తరిమేసిందని ప్రచారం జరిగింది. ఆ విషయమై క్లారిటీ ఇవ్వకుండా వనిత విజయ్ కుమార్ మరోసారి విరుచుకు పడింది.
 
"నా గురించి బాధపడుతున్నట్లుగా నటిస్తున్న వారిని నేను ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను. మొదట మీ జీవితాలను మీ కుటుంబాలను సరిదిద్దుకోండి. ఆ తర్వాత నా గురించి ఆలోచించవచ్చు. నా విషయం పట్ల ఎవ్వరూ జాలీ దయ చూపించాల్సిన అవసరం లేదు " అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది వనిత విజయ్ కుమార్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు