శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా... మహా శిఖరం తల తిప్పి చూడడు...

బుధవారం, 22 జులై 2020 (09:28 IST)
జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పవర్ స్టార్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 25వ తేదీన ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌ ద్వారా విడుదల చేయనున్నారు. ఇందుకోసం రూ.150 నుంచి రూ.250 వరకు టిక్కెట్ ధరను నిర్ణయించారు. అయితే పవన్‌ను లక్ష్యంగా చేసుకుని, అచ్చం పవన్‌లాగే ఉండే డూప్‌లను పెట్టి చిత్రం తీయడంపై అనేక మంది విమర్శలు గుప్పిస్తారు. అంతేకాకుండా, పలువురు హీరోలు సైతం ఆర్జీవిని దూషిస్తున్నారు. అలాంటి వారిలో తాజాగా టాలీవుడ్ యువ హీరో నిఖిల్ కూడా చేరిపోయాడు. 
 
తాజాగా, తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా... ఆ మహా శిఖరం తల తిప్పి చూడడు... మీకు అర్థం అయిందిగా?" అంటూ ట్వీట్ పెట్టారు. దీనికి 'పవర్ స్టార్', 'పవన్ కల్యాణ్' అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించాడు. దీనికి పవన్ కల్యాణ్‌కు చెందిన చిన్న వీడియోను కూడా జోడించాడు.
 
కాగా, ఓ హీరో ఎన్నికల్లో ఓడిపోయిన తరువాతి కథ అంటూ పవర్ స్టార్ చిత్రాన్ని ఆర్జీవీ నిర్మించారు. ఈ చిత్రం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించినదే అన్నది బహిరంగ రహస్యమే. ఎన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినా, ఎప్పటికప్పుడు చిత్రం గురించిన విశేషాలను పంచుకుంటూ వెళుతున్న వర్మ, తాజాగా, 'గడ్డి తింటావా...' పాటను విడుదల చేయగా, అది వైరల్ అయింది.

 

Shikaram ni chusi Kukka entha Morigina.. a maha shikaram thala thippi chudadhu...
meeeku Ardham ayyindi ga...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు