మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్.. సెల్ఫ్ క్వారంటైన్.. ఎందుకంటే?

గురువారం, 2 జులై 2020 (17:27 IST)
మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్.. ఇటీవల షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇంకా కరోనా వ్యాప్తి మరింతగా ఉన్న సమయంలోనే కళ్యాణ్ దేవ్ షూటింగ్‌కి హాజరు అయిన నేపథ్యంలో పర్సనల్‌గా తను కొన్ని రూల్స్ పెట్టుకున్నాడు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా సోకే ఛాన్స్ ఉంది.

అందుకోసం తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో స్వీయ నిర్భంధం చేసుకున్నాడు. తన భార్య శ్రీజా .. కుమార్తెలను ప్రమాదంలో పడేయడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే అదే ఇంట్లో విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నామని కల్యాణ్ దేవ్ తెలిపారు.
 
మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో హీరోగా మారాడు. తాజాగా  సూపర్ మచ్చీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. కాగా కోవిడ్ 19 వలన చిత్ర షూటింగ్‌కి కొన్నేళ్ళు బ్రేక్ పడగా, ఇటీవల తిరిగి మొదలైంది.

అయితే కరోనా వ్యాప్తి మరింతగా ఉన్న సమయంలోనే కళ్యాణ్ దేవ్ షూటింగ్‌కి హాజరు అయిన నేపథ్యంలో పర్సనల్‌గా తను కొన్ని రూల్స్ పెట్టుకున్నాడు. సెల్ఫ్ క్వారంటైన్‌లో వుండాలని నిర్ణయించుకున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు