చిరంజీవిగారి సినిమాలు చూసి డ్యాన్సులు నేర్చుకున్నా: గీతాంజ‌లి 2 దర్శకుడు శివ తుర్ల‌పాటి

డీవీ

శనివారం, 13 ఏప్రియల్ 2024 (19:31 IST)
director Siva Thurlapati
నేను చేసిన పాట‌లు చాలా మందికి తెలియ‌దు. నేను క‌నిపించ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ను కాబ‌ట్టి తెలిసే ఛాన్సే లేదు. తేజ‌గారి ద‌ర్శ‌క‌త్వంలో న‌వ‌దీప్ జైకి కొరియోగ్ర‌ఫీ చేశా. బ్ర‌హ్మాస్త్రం చేశా. శంక‌రాభ‌ర‌ణం చేశా... ఇంకా చాలా చాలా సినిమాలు... ప‌దివేల‌కు, ఐదు వేల‌కు సాంగ్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగులు నాకు పెద్ద‌గా రాలేదు. కానీ, నేను చేసిన ప్ర‌తి పాట‌లోనూ క‌థ చెప్పేవాడిని. కోన‌గారికి నాలో న‌చ్చిందే అది అని గీతాంజ‌లి 2 దర్శకుడు శివ తుర్ల‌పాటి అన్నారు.
 
సినిమా పై డేవిడ్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా గీతాంజ‌లి 2 దర్శకుడు శివ తుర్ల‌పాటి పలు విషయాలు చెప్పారు. - రెస్పాన్స్ జెన్యుయ‌న్‌గా బావుంది. రివ్యూలను కూడా చూశాను. రివ్యూల్లో చెప్పే విష‌యాల‌ను నేనెప్పుడూ పాజిటివ్‌గా తీసుకుంటాను. సినిమాలో చాలా వాటికి ఆన్స‌ర్ చేయ‌కుండా వ‌దిలేశార‌ని కొంద‌రు రాశారు. అయితే, ఆ లాజిక్కుల‌న్నిటికీ స‌మాధానం చెబుతూ పోతే, యానిమ‌ల్ సినిమాలాగా మూడు గంట‌ల నిడివి వ‌స్తుంది. నేను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది అది కాదు. ఇది ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ సినిమా. కాంజూరింగ్ టైప్ హార‌ర్ ఇందులో చేయాల‌నే థాట్ మాకు లేదు. ఎంట‌ర్‌టైనింగ్ సినిమాగానే చేశాం. కోనగారి మార్కు రైటింగ్‌ని ఆస్వాదించేవారికి చాలా బాగా న‌చ్చుతోంది. సినిమా చూసిన వారు నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. వీకెండ్ కాబ‌ట్టి, యుఎస్‌లో ఇప్పుడు అంద‌రూ సినిమా చూస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది అక్క‌డి నుంచి. సునీల్‌, స‌త్య కామెడీ సెకండాఫ్ లో పేలింది. క్లైమాక్స్ ని కొంద‌రు ఎక్స్ ట్రార్డిన‌రీ అని మెచ్చుకుంటున్నారు. కొంద‌రు స‌డ‌న్‌గా పూర్త‌యింది అని అన్నారు. మ‌రికొంద‌రు అదేంట‌ని అన్నారు. ఇలాంటి అనుమానాలు అన్నిటికీ థ‌ర్డ్ పార్ట్ లో స‌మాధానం ఉంటుంది. ఈ విష‌యాల‌న్నిటినీ నేను కోన‌గారితోనూ డిస్క‌స్ చేశాను.
 
చిన్నప్ప‌టి నుంచీ చిరంజీవిగారి సినిమాలు చూసి డ్యాన్సులు నేర్చుకున్నా. కోటిలో శ్రీను మాస్ట‌ర్ అని గురువుగారి ద‌గ్గ‌ర డ్యాన్సు నేర్చుకున్నా. అప్ప‌ట్లో ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్ కార్డు ఇప్పించారు. బ‌ద్రిలోబ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్‌గా ఫ‌స్ట్ టైమ్ చేశాను. రాకేష్ మాస్ట‌ర్‌, హ‌రీష్ మాస్ట‌ర్ ఎంక‌రేజ్ చేశారు. అప్పుడే తేజ‌గారు పిలిచి కొరియోగ్రాఫ‌ర్‌గా చేయ‌మ‌న్నారు. నేను డ్యాన్స్ మాస్ట‌ర్ కార్డు తెచ్చుకున్నా. మాస్ట‌ర్ అయ్యాక బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్స‌ర్‌గా చేయ‌డానికి లేదు. అప్పుడు త‌మిళ్ డ్యాన్స్ మాస్ట‌ర్ల హ‌వా ఉండేది. ఆ టైమ్‌లో నేను ముంబైకి వెళ్లా. అక్క‌డ డ్యాన్స‌ర్‌గా చేసుకోవ‌చ్చ‌నే వెళ్లా. భ‌రున్ ముఖ‌ర్జీ అని.. మ‌న వీయ‌స్ ఆర్ స్వామి గారికి గురువుగారున్నారు. ఆయ‌న్ని క‌లిశాను. ఆయ‌న‌తో ఏడు యాడ్ ఫిల్స్మ్ చేశా. ఆయ‌నరెమోసార్ ద‌గ్గ‌రికి పంపారు.

ఆ త‌ర్వాత ఫైన‌ల్‌గా అమెరికాకి వెళ్లా. అప్పుడు నా గ‌ర్ల్ ఫ్రెండ్ అమెరికాలో ఉండేది. నాకూ వీసా రావ‌డంతో పెళ్లి చేసుకుని వెళ్లిపోయా. నేన‌లా వెళ్లానో లేదో... ఇలా  స్టార్‌వార్‌, ఢీలు మొద‌ల‌య్యాయి. ఫిల్మ్ సిటీలో నేను నాలుగేళ్లు ప‌నిచేశా. కానీ అప్పుడు లేని షోలు.. ఇప్పుడు మొద‌ల‌య్యాయే అనిపించింది. కొన్నాళ్ల‌కు మ‌ళ్లీ నేను డ్యాన్స్ స్కూలు పెట్టుకున్నా. హైద‌రాబాద్‌లో సెటిల‌య్యా. మా డ్యాన్స్ఇన్‌స్టిట్యూట్‌లో ఇప్పుడు కూడా 500 - 600 మంది ఉన్నారు. నీ ఇంటికి ముందో గేటు.. అనే పాట‌కు మా స్టూడెంట్స్ తో క‌లిసే క‌వ‌ర్‌సాంగ్ చేశా. అస‌లు క‌వ‌ర్ సాంగ్స్ ఉంటాయ‌ని కూడా నాకు తెలియ‌దు. అది చూసి కోన‌గారికి న‌చ్చి మ‌ళ్లీ పిలిచారు. ఇలా ఇప్పుడు మీముందున్నా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు