చిరంజీవి 'ఆచార్య' అప్‌డేట్స్ : మాజీ నక్సలైట్‌గా చెర్రీ!

గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:17 IST)
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సందేశాత్మక చిత్రంగా నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి పవర్‌ఫుల్ దేయాదాయ ధర్మాదాయ శాఖ అధికారి పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కనిపించనుంది. 
 
అయితే, ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌ సైతం ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 నిమిషాల పాటు రాంచరణ్ తెరపై సందడి చేస్తారని, ఒక మిషన్‌లో పని చేస్తూ ప్రాణాలు కోల్పోయే మాజీ నక్సలైట్ పాత్రను పోషించున్నారన్నది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ల సమయంలో వచ్చే సన్నివేశాల్లో చెర్రీ మాజీ నక్సలైట్‌గా కనిపిస్తారట. 
 
ఇందుకు చెర్రీకి లుక్ టెస్ట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 70శాతం వరకు షూటింగ్‌ పూర్తయిందని తెలుస్తుండగా, మిగతా భాగాన్ని పూర్తి చేసేందుకు అక్టోబరు షూటింగ్‌ ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు