గంగవ్వ చెప్పేదన్నీ నిజాలేనా, బిగ్ బాస్ విజేత అతనేనా..? (video)

శనివారం, 17 అక్టోబరు 2020 (15:25 IST)
బిగ్ బాస్ 4 సీజన్‌లో గంగవ్వ చేసిన హడావిడి అంతాఇంతా కాదు. ఆమె కోసమే లక్షలాదిమంది టీవీలకు అతుక్కునిపోయి బిగ్ బాస్ చూడడం మొదలుపెట్టారు. మొదట్లో మూస పద్థతిలో ఉన్నా ఆ తరువాత గంగవ్వ అమాయకత్వం.. ఉన్నట్లుండి చలాకీతనం ఇవన్నీ కలిపి బిగ్ బాస్‌కు కొత్తదనం తెచ్చిపెట్టాయి. ప్రేక్షకులను ఎక్కువగా చూసే విధంగా చేశాయి.
 
గంగవ్వ ఆరోగ్యం బాగా లేక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చేసింది. ఇప్పుడు అసలు బిగ్ బాస్ లోనే లేదు. మొదట్లో కూడా ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చేయడం.. తిరిగి వెళ్ళడంతో కాస్తంత ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. కానీ ఎలాంటి ఫైన్ వేయకుండా గంగవ్వను హౌస్‌లో కొనసాగించారు. 
 
కానీ రాను రాను తాను అనారోగ్యానికి గురవుతున్నానని గంగవ్వ చెప్పింది. అందుకే తను హౌస్ నుంచి వెళ్ళిపోతున్నట్లు స్ఫష్టం చేసింది గంగవ్వ. అంతేకాదు ఇంతకు ముందే జోర్థార్ సుజాత ఎలిమినేట్ అవుతుంది. నువ్వే ఇక బయటకు వెళ్ళిపోతావ్.. వచ్చే వారం నువ్వే అంటూ చెప్పుకొచ్చింది గంగవ్వ.
 
ఆమె చెప్పినట్లే చివరకు జరిగింది. సుజాత ఎలిమినేట్ అయ్యింది. అంతేకాదు ముక్కు అవినాష్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది గంగవ్వ. హౌస్ లోనే ప్రత్యేక ఆకర్షణ అవినాష్. అందరినీ నవ్విస్తూ చలాకీగా ఉంటాడు. ఈసారి బిగ్ బాస్ షోలో విజేత అతనే అంటూ చెప్పుకొచ్చింది గంగవ్వ. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. గంగవ్వ చెప్పినట్లే అన్నీ జరుగుతోందనీ.. కాబట్టి అవినాష్ విజేతగా నిలవడం ఖాయమనుకుంటున్నారు అభిమానులు. మరి చూడాలి.. గంగవ్వ చెప్పింది నిజమవుతుందో లేకుంటే వేరొకరు విజేతలుగా నిలుస్తారో.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు