మంచి హృదయమున్న నా లైఫ్‌మేట్‌కు బర్త్‌డే విషెస్... పూనమ్ బజ్వా

గురువారం, 29 అక్టోబరు 2020 (15:38 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మరో నటి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఆమె పేరు పూనమ బజ్వా. ఈ పంజాబీ భామ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. అంతేకాదండోయ్... ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో నటించింది. ఈ చిత్రమే ఆమె వెండితెరపై చివరిసారిగా కనిపించడం. 
 
ఈ నేవీ అధికారి కుమార్తె ఓ యువకుడి ప్రేమలో మునిగితేలుతోంది. అతని పేరు సునీల్ రెడ్డి. ముంబైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినీ అవకాశాల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేసి విఫలమైంది. గత యేడాది రెండు చిత్రాల్లో నటించిన ఈమె.. ఈ యేడాది ఒక్క చిత్రంలో కూడా అవకాశం దక్కించుకోలేక పోయింది.
 
అదేసమయంలో తన ప్రియుడితో ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. తన ప్రియుడు పెళ్లి చేసుకోవడానికి పూనం రెడీ అవుతోంది. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు సునీల్ రెడ్డిని పరిచయం చేసింది. 
 
సునీల్ బర్త్ డే సందర్భంగా అతనితో కలిసి ఉన్న పలు ఫొటోలను షేర్ చేసింది. మంచి హృదయమున్న నా లైఫ్ మేట్, సోల్ మేట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేసింది. నీతో ఉండే ప్రతి క్షణం ఓ మ్యాజిక్‌లా ఉంటుందని  చెప్పింది. నా రూట్స్, గ్రౌండ్ అంతా నీవేనని అతనిపై ఉన్న ప్రేమను చాటింది.

 

#PoonamBajwa : "Birthday greetings

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు