నిఖిల్ సరసన ప్రేమమ్ గర్ల్..

శనివారం, 1 ఆగస్టు 2020 (13:22 IST)
ప్రేమమ్ గర్ల్ అనుపమ పరమేశ్వరన్‌కు టాలీవుడ్ ఆఫర్ వచ్చింది. యువ కథానాయకుడు నిఖిల్ సరసన ఆమె నటించనుంది. ప్రస్తుతం నిఖిల్ కథానాయకుడుగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. '18 పేజెస్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించారు.
 
బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్‌కి ముందు లాంఛనంగా మొదలైంది కూడా. ఇక ఈ చిత్రంలోని కథానాయిక పాత్ర కోసం పలువుర్ని పరిశీలించిన తర్వాత అనుపమ పరమేశ్వరన్‌ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు