తిరుపతిలో రష్మిక మందన 15 రోజులు మకాం... ఎందుకో తెలుసా?

శనివారం, 24 అక్టోబరు 2020 (19:48 IST)
రష్మిక మందన ఇప్పుడు తెలుగులో ప్రేక్షకుల్లో హాట్ హీరోయిన్. వరుస విజయవాలతో ఆమె దూసుకుపోతోంది. దీంతో మరో తెలుగు సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది. చలో, గీత గోవిందం మొదలుకొని మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, ఆ తరువాత నితిన్‌తో భీష్మ చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాయి. 
 
ఇదే జోష్‌తో అల్లుర్జున్ సరసన పుష్ప, శర్వానంద్ సరసన నటిస్తోంది. ఆ సినిమా పేరు ఆడాళ్ళూ మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి తిరుపతిలో ప్రారంభం కాబోతోంది. దీంతో రష్మిక తిరుపతికి చేరుకుంది. రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతోంది. 
 
15 రోజుల పాటు షూటింగ్ తిరుపతిలో జరుగనుంది. రష్మిక సినిమా షూటింగ్ తిరుపతిలో జరుగుతోందని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున రావడానికి సిద్ధమవుతున్నారు. మరి చూడాలి జనాన్ని ఎలా అదుపుచేస్తారో...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు