టాలీవుడ్‌లో మరో డైరెక్టర్‌కి కరోనా, ఇంతకీ ఎవరా డైరెక్టర్..?

గురువారం, 13 ఆగస్టు 2020 (10:38 IST)
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకి కరోనా పెరుగుతుందే కానీ.. తగ్గడం లేదు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే... బండ్ల గణేష్‌కి ఫస్ట్ కరోనా వచ్చింది. ఆ తర్వాత ఆయన హాస్పటల్‌కి వెళ్లకుండా ఇంట్లో ఉండే బలమైన ఆహారం తీసుకుని కరోనా నుంచి బయటపడ్డారు.
 
ఆ తర్వాత రాజమౌళి, తేజ, లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం, సింగర్ స్మిత, నిర్మాత దానయ్య కరోనా బారినపడ్డారు. రాజమౌళి, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరోనా నుంచి బయటపడ్డారు. రీసెంట్‌గా రాజమౌళి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
 
ఇదిలా ఉంటే...తాజాగా టాలీవుడ్లో మరో డైరెక్టర్‌కి కరోనా వచ్చింది. ఇంతకీ ఎవరంటే... ఆర్ఎక్స్100 సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే సెన్సేషన క్రియేట్ చేసిన అజయ్ భూపతి. తనకు కరోనా సోకిన విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. అయితే... తను త్వరలోనే కరోననా బారి నుంచి బయటపడతానని, ప్లాస్మా కూడా డొనేట్ చేస్తానని ప్రకటించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు