ఇంకా నేను హీరోగా యాక్ట్ చేస్తున్నాన్నంటే కార‌ణం అదే - రజనీకాంత్

శనివారం, 4 జనవరి 2020 (17:23 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఆదిత్య అరుణాచలంగా ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఎ.ఆర్‌. మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. 
 
తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.వి. ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి జ‌న‌వ‌రి 9న తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ మాట్లాడుతూ – “నాకు 70 ఏళ్లు అవుతుంది. ఇంకా నేను హీరోగా యాక్ట్ చేస్తున్నాన్నంటే కార‌ణం ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాలు, ప్రోత్సాహ‌మే కార‌ణం. ఇంత వ‌య‌సులోనూ ఇంత ఎన‌ర్జిటిక్‌గా ఎలా ఉన్నార‌ని కొంతమంది అడుగుతుంటారు. 
 
త‌క్కువ‌గా ఆశ‌ప‌డండి. త‌క్క‌వగా బాధ‌ప‌డండి.. త‌క్కువ‌గా భోజ‌నం చేయండి.. త‌క్కువ‌గా నిద్రపోండి.. త‌క్కువ‌గా ఎక్స‌ర్‌సైజ్ చేయండి, త‌క్కువ‌గా మాట్లాడండి.. ఇవ‌న్నీ చేస్తే సంతోషంగా ఉంటాం. 1976 తెలుగులో అంతులేని క‌థ విడుద‌లైంది. అప్ప‌టి నుండి ఇప్ప‌టివ‌ర‌కు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే ఉన్నారు. త‌మిళ ప్రేక్ష‌కులు న‌న్ను ఎలా ప్రేమిస్తారో అదే ప్రేమ‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఇవ్వ‌డం నా భాగ్యంగా, పూర్వజ‌న్మ సుకృతంగా భావిస్తాను.
 
తెలుగు ప్రేక్ష‌కులు సినీ ప్రేమికులు మంచి సినిమాను ఎప్పుడూ ఆద‌రిస్తారు. నేను చేసిన భాషా, ముత్తు, పెద‌రాయుడు, న‌ర‌సింహ‌, చంద్ర‌ముఖి, రోబో కేవ‌లం నాకోసమే ఆడ‌లేదు. మంచి సినిమాలు. అందులో నేను కూడా యాక్ట్ చేశాను. అంద‌రూ సినిమా బాగా హిట్ కావాల‌నే చేస్తారు. అయితే సినిమా చేసే స‌మ‌యంలో ఓ మ్యాజిక్ జ‌రుగుతుంది. ఆ మ్యాజిక్ మ‌న చేతుల్లో ఉండ‌దు. అలాంటి మ్యాజిక్ ఈ సినిమాకు జ‌రిగింది. 
 
మురుగ‌దాస్‌ గారితో ప‌నిచేయాల‌ని 15 ఏళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నాను. ఈ సినిమాకు కుదిరింది. సుభాస్క‌ర‌న్‌ గారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. సినిమాలంటే ప్యాష‌న్ ఉన్న నిర్మాత‌. ఇప్పుడు కూడా బాహుబ‌లి లాంటి సినిమా పొన్నియ‌న్ సెల్వ‌న్‌ను నిర్మిస్తున్నారు. ఆయ‌న నిర్మించిన చిత్ర‌మిది.
 
ఈ సినిమాలో ఆదిత్య అరుణాచ‌లం అనే పోలీస్ ఆఫీస‌ర్ పాత్రను చేశాను. ఈ క‌థ‌ను వింటే హీరో, నిర్మాత ఎలా చేశారీ సినిమాను అనుకుంటారు. కానీ మురుగ‌దాస్‌గారు ఇచ్చిన స్క్రీన్‌ప్లే అద్బుతంగా ఉంది. 
 
కెమెరామెన్ సంతోశ్ శివ‌న్‌, అనిరుధ్ మ్యూజిక్‌తో సినిమాకు వెయిట్ పెంచారు. రామ్ ల‌క్ష్మ‌ణ్‌గారు అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేశారు. తిరుప‌తి ప్ర‌సాద్‌గారు తెలుగులో సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ద‌ర్బార్ సినిమా క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది. 168 సినిమాలు చేశాను. ఈ సినిమా డిఫ‌రెంట్ మూవీ. ద‌ర్బార్ కంప్లీట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. సునీల్ శెట్టి స‌హా అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. అంద‌రూ బావుండాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు