త్రిషకి... భలే ఛాన్స్? బద్లా రీమేక్‌లో ప్రధాన పాత్రధారిగా...

బుధవారం, 20 మార్చి 2019 (15:45 IST)
అమితాబ్.. తాప్సీలు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం 'బద్లా', ఈ చిత్రం ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగు... తమిళ భాషలలో రీమేక్ చేసేందుకు నిర్మాత ధనుంజయ్ సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం.
 
తన ప్రమేయం లేకుండానే ఒక హత్య కేసులో చిక్కుకున్న ఒక అమ్మాయి (తాప్సీ)ని కాపాడటానికి ఒక లాయర్‌ (అమితాబ్)గా రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత చోటుచేసుకునే అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుంది. 
 
కాగా, ఈ సినిమా రీమేక్‌లో తాప్సీ పాత్ర కోసం త్రిషను తీసుకునే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని వినికిడి. ఇటీవల '96' హిట్‌తో త్రిష క్రేజ్ మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ పాత్రకు ఆమెను ఎంచుకున్నారని చెప్తున్నారు. 
 
త్రిష ఎంపిక దాదాపు ఖరారైపోతుందనే అభిప్రాయాలను వ్యక్తం అవుతున్నాయి. అదే నిజమైతే... త్రిష కెరీర్‌లో మరో హిట్ కూడా చోటు చేసుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ చిత్రం తొలుత తమిళంలోకి రీమేక్ కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు