విజయ్ దేవరకొండ - సుకుమార్ మూవీ స్టోరీ లీకైంది

మంగళవారం, 6 అక్టోబరు 2020 (17:41 IST)
ఎవడే సుబ్రమణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సంచలనం సృష్టించిన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ హీరో ఫైటర్ అనే సినిమా చేస్తున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూరి - ఛార్మి - కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో తాజా షెడ్యూల్ ప్రారంభించనుంది.
 
ఇదిలావుంటే.. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ ఓ కొత్త సినిమాను ఎనౌన్స్ చేసాడు. అది కూడా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్‌తో. విజయ్ - సుక్కు కాంబినేషన్లో రూపొందే సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో అసలు కథ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. కథ గురించి ఆరా తీస్తే.. ఓ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... తెలంగాణ సాయుధపోరాటం నేపధ్యంతో ఈ సినిమా ఉంటుందని.
 
ఈ వార్త ప్రచారంలోకి రావడానికి ఓ రీజన్ ఉంది. రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ తెలంగాణ సాయుథ పోరాటం మీద సినిమా తీయాలి అనుకున్నారు. దీనికి సుకుమార్ చాలా కసరత్తు చేసారు. తెలంగాణ సాయుధ పోరాటంకు సంబంధించి పుస్తకాలు చదివాడు. కథ రెడీ చేసుకున్నాడు. మహేష్‌ బాబుకి చెప్పాడు.
 
అయితే... మహేష్ ఈ కథ రిస్క్ అనుకున్నాడో ఏమో కానీ.. నో చెప్పాడు. ఇప్పుడు ఈ కథతోనే విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నాడు అంటున్నారు. విజయ్ దేవరకొండ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో అతనికి కరెక్ట్‌గా సెట్ అవుతుంది అంటున్నారు. మరి.. ప్రచారంలో ఉన్నది నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు