నేను కూడా అత్యాచారానికి గురయ్యాను.. రాహుల్ రామకృష్ణ

బుధవారం, 22 జనవరి 2020 (18:26 IST)
అత్యాచారం ఓ రాక్షస అకృత్యం. అత్యాచారం మహిళలపై జరిగే టాలీవుడ్ టాప్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్స్‌లో ఒకరైన రాహుల్ రామకృష్ణ తన చిన్నతనంలో జరిగిన ఒక దారుణమైన సంఘటనను ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు. చిన్నతనంలో అత్యాచారానికి గురైయ్యానని తెలిపాడు. ఈ సమాజంలో న్యాయం లేదని తెలిపాడు. ఇంతకుమించి తన బాధను ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు.
 
ఇంట్లో మగవాళ్ళకు మంచిగా బిహేవ్ చేయడం నేర్పించండని తెలిపాడు. ఈ సొసైటీ కండీషనింగ్ నుండి బయటకు రండి, స్వేచ్ఛగా బ్రతకండంటూ రాహుల్ తన బాధను వెళ్లగక్కాడు. ఇది రాహుల్ రామకృష్ణ ఒక్కడి వ్యధ మాత్రమే కాదు.. ఎందరో నోరు తెరచి చెప్పుకోలేని వారి రొద అంటూ కామెంట్స్ చేశాడు. ఆడ-మగ అనే తేడా లేకుండా జరుగుతున్న అత్యాచారాలకు, లైంగిక దాడులకు స్వస్తి ఎప్పుడని ప్రశ్నించాడు. 
 
ఇందుకు సమాధానం ప్రభుత్వాల నుంచి రాదని, సమాజం నుంచో రాదని.. మనలో నుంచి రావాలన్నారు. మన భవిష్యత్ తరాలకు సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం, సెక్స్ అంటే కోరిక కాదు జీవితంలో ఒక శారీరిక అవసరం మాత్రమే అని తెలుసుకొనే విజ్ఞత రావాలన్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు