వచ్చే జన్మలో జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయ కుక్కలా పుట్టాలనుకుంటున్నా: వర్మ

గురువారం, 4 మార్చి 2021 (09:00 IST)
రాంగోపాల్ వర్మ. ఆయన స్పందించే తీరే వేరు. అసలామాటకు వస్తే సినిమాలు సైతం ఆయన కోణం డిఫరెంట్. అందరూ ఒకలా చూస్తే ఆయన మాత్రం విభిన్నంగా చూస్తుంటారు. అందుకే అంత పెద్ద డైరెక్టర్ అయ్యారనుకోండి.
 
ఇక అసలు విషయానికి వస్తే... జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తన పెంపుడు కుక్కకి రొట్టెముక్క పెడుతున్నారు. దానికి మాత్రమే పెడితే ఓకే... కానీ కుక్కకి పెడుతూనే మరో చేత్తో అదే కంచంలో రొట్టెను ఆమె తింటున్నారు. ఈ వీడియోపై వర్మ తనదైన స్టయిల్లో స్పందించారు.
 

After seeing this video of @GadwalvijayaTRS I am wondering if she was drunk with love on a dog or in love with a drunk dog but the question is whether she loves the people as much as her dog.Honestly I pray to be born as a dog in my next birth if a mayor can love me this muchpic.twitter.com/3dQNXRFp13

— Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2021
ఆయన మాటల్లోనే... " ఈ వీడియో చూసిన తరువాత గద్వాల్ జయ, ఆమె ప్రేమనంతా తాగేసి ఆ కుక్కపై అలా ప్రేమ చూపిస్తున్నారా లేదా తాగిన కుక్కతో ఆమె అలా కరుణ చూపిస్తున్నారా అని నేను ఆశ్చర్యపోతున్నాను. కానీ నా ప్రశ్న ఏంటంటే... ఆమె తన కుక్కలాగే ప్రజలను ప్రేమిస్తుందా అని. నాకు మాత్రం అనిపిస్తుంది, ఈ మేయర్ వద్ద నా తదుపరి జన్మలో కుక్కగా పుట్టాలని ప్రార్థిస్తున్నాను''

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు