ఎపి సిఎం జగన్ జుట్టు రాలకుండా ఉండటానికి ఆ వ్యక్తే కారణమా?

బుధవారం, 22 జులై 2020 (17:24 IST)
సాధారణంగా రాజకీయ నేతలు ఎక్కువగా అలిసిపోతుంటారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎప్పుడూ టెన్షన్ పడుతూనే ఉంటారు. ఒక్కసారి టెన్షన్ పడితే అది కాస్త అలా కొనసాగితే ఖచ్చితంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఇది అందరికీ తెలిసిందే.
 
ఎక్కువ టెన్షన్ ఉన్న వారికి జుట్టు రాలిపోతూ ఉంటుందని పెద్దగా చెప్పనక్కర్లేదు. అయితే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. అది కూడా వందల కిలోమీటర్లు నడిచారు. ఎండలో.. ఎంతోమంది నాయకులను కలుపుకుని దుమ్ము, ధూళి మధ్య ఆయన పాదయాత్ర సాగింది.
 
అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన జుట్టుకు ఎలాంటి హాని కలుగకుండా.. జుట్టు అస్సలు రాలకుండా చూసుకున్న వ్యక్తి ప్రకాష్. హెయిర్ స్టైల్ స్పెషలిస్ట్ ఈయన. లండన్‌లో హెయిర్ స్టైల్ స్పెషలిస్ట్‌గా పనిచేసి ఎంతోమంది ప్రముఖులకు సలహాలు, సూచనలు ఇస్తుంటాడు.
 
అలాంటి వ్యక్తి హీరో శర్వానంద్ ద్వారా ఎపి సిఎంకు పరిచయమయ్యాడట. అది కూడా ఎన్నికలకు ముందే. అంతే... పాదయాత్ర నుంచి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి వెంట్రుకలు అలాగే.. పటుత్వంగా చెక్కుచెదరకుండా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు ప్రకాష్. అంతేకాకుండా ఎలాంటి పౌష్టికాహారాన్ని తీసుకోవాలో కూడా చెబుతూ వచ్చారు. ఇది కాస్త బాగా పనిచేస్తుండటంతో ప్రకాష్‌ను హెయిర్ స్పెషలిస్ట్‌గా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కొనసాగిస్తున్నారట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు