జయలలిత నెచ్చెలి శశికళ సంచలన ప్రకటన: రాజకీయాలకు గుడ్ బై

బుధవారం, 3 మార్చి 2021 (21:45 IST)
తను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు జయలలిత నెచ్చెలి శశికళ సంచలన ప్రకటన చేసారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆమె ప్రభావం తమిళనాడులో భారీగా వుంటుందని ఇప్పటికే అన్నాడీఎంకె వర్గాలు బిక్కుబిక్కుమంటున్నాయి.
 
కాగా కె. శశికళ బుధవారం ఒక లేఖలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. అన్నాడీఎంకె కార్యకర్తలు, అంతా కలిసి డీఎంకెను ఓడించడమే ధ్యేయంగా పెట్టుకోవాలని ఆమె సూచించారు. ఐతే ఆమె రాజకీయాలకు ఎందుకు స్వస్తి చెప్పారన్నది తెలియాల్సి వుంది.
 
ఇదిలావుంటే ఆమె మేనల్లుడు టిటివి ధినకరన్ తెన్కాసిలో విలేకరులతో మాట్లాడుతూ, శశికళ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు