జనసేనానికి రాపాక మరోసారి కుతకుత, కొడుకుకి సీఎం జగన్ సమక్షంలో వైసిపి తీర్థం

శుక్రవారం, 4 డిశెంబరు 2020 (21:37 IST)
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జనసేనాని పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చారు. పేరుకే జనసేనలో వుంటున్నారు కానీ వైసిపి ఎమ్మెల్యేలను మించిపోయి సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మొన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి వుండాలని ఆకాంక్షించారు. అసలు ఏపీ ముఖ్యమంత్రి స్థానంలో జగన్ మోహన్ రెడ్డిని తప్ప మరొకర్ని ఊహించుకోలేనని కూడా అన్నారు.
 
ఒకవైపు వీటి గురించి చర్చ జరుగుతూ వుండగానే మరోసారి జనసేన చీఫ్ పవన్ కి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు రాపాక వెంకట్ రామ్ ను వైసీపీలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో స్వయంగా రాపాక పాల్గొన్నారు. సీఎం జగన్ రాపాక కుమారుడికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు