మానవ చరిత్రలో తొలిసారి... వాణిజ్య స్పైస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి వ్యోమగాములు

సోమవారం, 1 జూన్ 2020 (09:29 IST)
మానవ చరిత్రలో ఓ ఆద్భుతం ఆవిష్కృతమైంది. తొలిసారి ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. కాలిఫోర్నియాకు చెందిన స్పేస్ ఎక్ అనే ప్రైవేటు సంస్థ నిర్వహించిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది. 19 గంటల సుధీర్ఘ ప్రయాణం తర్వాత అమెరికాకు చెందిన ఇద్దరు ఆస్ట్రోనట్స్ బాబ్ బెన్ కెన్, డౌగ్ హార్లీలు అంతరిక్షంలో అడుగుపెట్టగా, అక్కడ ఉన్న ముగ్గురు వ్యోమగాలు వారికి ఘన స్వాగతం పలికారు. 
 
స్పేస్ ఎక్స్ ప్రైవేట్ సంస్థ పంపిన ఇద్దరు వ్యోమగాములు 19 గంటల సుధీర్ఘ ప్రయాణం తర్వాత ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటరులో పాదం మోపారు. వీరికి ఇప్పటికే స్పేస్ సెంటరులో ఉన్న ముగ్గురు ఆస్ట్రోనట్స్ ఘన స్వాగతం పలికారు. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షానికి కూడా వాణిజ్య సేవలు ప్రారంభించినట్టయింది. 
 
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న హౌథ్రోన్‌లోని స్పేస్ ఎక్స్ మిషన్ కంట్రోల్ సెంటర్ నేతృత్వంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన ఇద్దరు సీనియర్ వ్యోమగాములు రోబర్ట్ బెన్ కెన్, డగ్లస్ హర్లీలు, రెండు దశల ఫాల్సన్ 9 రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లారు. డెమో-2 పేరుతో స్పేస్ ఎక్స్ సంస్థ నాసా తరపున ఈ ప్రైవేటు రాకెట్‌ను ప్రయోగించింది. 
 
ఇది నిజానికి మూడు రోజుల క్రితం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఇదే ప్రయోగం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకూలించడంతో శనివారం రాత్రి దీన్ని మళ్లీ ప్రయోగించారు. ఈ వ్యోమగాములు మొత్తం 19 గంటల పాటు ప్రయాణంచి స్పేస్ సెంటర్‌లో అడుగుపెట్టారు.
 
బాబ్ బెన్ కెన్, డౌగ్ హార్లీలు ప్రయాణించిన రాకెట్, మధ్యాహ్నం 1.02 గంటలకు (17.02 జీఎంటీ) వీరు ఐఎస్ఎస్ చేరారు. బ్లాక్ పోలో షర్ట్, ఖాకీ ప్యాంట్ ధరించిన బెన్ కెన్ తొలుత, ఆయన వెంట హార్లీ స్పేస్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. అప్పటికే అక్కడ ఉన్న యూఎస్ ఆస్ట్రొనాట్ క్రిస్ క్యాసిడీ, రష్యా కాస్మొనాట్స్ అనతొలి వానిషిన్, ఇవాన్ వాంగర్ స్వాగతం పలికారు.
 
హూస్టన్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్ స్టయిన్ రాకెట్ క్రూతో మాట్లాడారు. "బాబ్, డౌగ్ మీకు సుస్వాగతం. ఈ మిషన్‌ను ప్రపంచమంతా చూసిందని నేను మీకు చెబుతున్నాను. దేశం కోసం మీరు చేస్తున్న కార్యక్రమం మాకెంతో గర్వకారణం" అని అన్నారు.
 
ఈ రాకెట్ ద్వారా అంతరిక్షానికి చేరుకున్న వ్యోమగాములకు యూఎస్ ఆస్ట్రోనాట్ క్రిస్ కాసిడీ, రష్యాకు చెందిన కాస్మోనాట్స్ అనతులీ ఇవానిషిన్, ఐవాన్ వాంగర్‌లు స్వాగతం పలికారు. ఇక, 'డెమో-2' అనే పేరుతో ఈ రాకెట్ ప్రయోగం జరిగింది. స్పేస్ ఎక్స్ తయారుచేసిన డ్రాగన్ క్యాప్స్యూల్‌కు నాసా సర్టిఫికెట్ లభించిన తర్వాత, ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రయోగంతో అంతరిక్షానికి వాణిజ్య సేవలను ప్రారంభించినట్లయిందని స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. తన కల నిజమైందని ఆయన అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు