జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు: బూరలో గాలి పోయినట్లు తుస్సుమనిపించిన భాజపా, గేర్ మార్చిన కారు

శుక్రవారం, 4 డిశెంబరు 2020 (15:23 IST)
హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో తెలంగాణ అధికార టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలోకి కొనసాగుతోంది. అసదుద్దీన్ ఒవైసి AIMIM రెండవ స్థానంలో ఉంది. భాజపా 3వ స్థానంలో కొనసాగుతోంది.
 
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు చెందిన టిఆర్ఎస్ 57 స్థానాల్లో, బిజెపి 28 స్థానాల్లో, అసదుద్దీన్ ఒవైసి యొక్క ఎఐఐఎం 30 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు లీడ్స్ చెపుతున్నాయి.
 
పోస్టల్ బ్యాలెట్లతో బిజెపి మంచి ఆరంభాన్ని చూపింది. ఈ ట్రెండ్స్ చూసి బిజెపి నాయకులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. దాదాపు అన్ని పార్టీల పోటీ చేసాయి. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికలలో మంగళవారం 46.55 శాతం ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 74.67 లక్షల మంది ఓటర్లుండగా 34.50 లక్షల మంది ఓటు వేశారు.
 
ఎన్నికలు బ్యాలెట్ పేపర్లను ఉపయోగించిన నేపధ్యంలో ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి మాత్రమే ఫలితాలు తెలిసే అవకాశం ఉంది. ఇటీవల దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయంతో ఉత్సాహంగా ఉన్న బిజెపి, అమిత్ షా, జెపి నడ్డా, యోగి ఆదిత్యనాథ్, ప్రకాష్ జవదేకర్, స్మృతి ఇరానీ వంటి జాతీయ నాయకులు ప్రచారం చేసారు. 2023 రాష్ట్ర ఎన్నికలలో ఖచ్చితంగా కాషాయ జెండా ఎగురవేస్తామని భాజపా శ్రేణులు ధీమాగా చెప్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు