గబ్బిలం ఇంట్లోకి వస్తే .. ఏం చేయాలంటే..?

శుక్రవారం, 2 నవంబరు 2018 (11:46 IST)
గబ్బిలాలకు రాత్రుల్లోనే కళ్లు బాగా కనిపిస్తాని చెప్తారు. గబ్బిలం ఇంటి ఎదురుగా వచ్చి ఉందంటే ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతారని చాలామంది నమ్మకం. దీని అరుపు చాలా హానికరమని కూడా చెప్తుంటారు. ఒకవేళ గబ్బిలాలు ఇంట్లోకి ప్రవేశిస్తే.. ఏం చేయాలి దేవుడా అంటూ.. తికమకపడుతుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి..
 
గబ్బిలాలు సాధారణంగా గృహాల్లోకి ప్రవేశించవు. గబ్బిలం సహజంగా ప్రతిధ్వని జ్ఞానంతో పరుగులు తీస్తుంటుంది. కిచ్‌కిచ్ అంటూ అది చేసే శబ్దం దాని ఎదురుగా ఉండే గోడలు లేదా వస్తువుల మీద పడి తిరిగి ఆ శబ్దం దానికే చేరుతుంది. అప్పుడు గబ్బిలం ఆ శబ్దం ఎటువైపు వస్తుందో.. అప్పుడే అది పయనం చేస్తుంది. కనుక ఇంట్లోకి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో రాదు. ఒకవేళ వస్తే మాత్రం దాని రెక్కల ద్వారా బ్యాక్టీరియా విడుదలై గృహ ఆవరణాన్ని పాడుచేస్తుంది.  
 
అలాంటప్పుడు ఏం చేయాలంటే.. పసుపుతో నీళ్లు తయారుచేసి ఆ నీటిని ఇంటి మెుత్తం చల్లుకోవాలి. ఆ తరువాత గుగ్గిలం పొగ వేసుకుని ఇల్లును వాడుకోవచ్చు. గబ్బిలం ఇంట్లోకి వచ్చిందని ఆ ఇంటిని వదలివేయకుండా.. ఇలా చేస్తే దాని వలన ఏర్పడిన దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు