గణేశ చతుర్థి రోజున వ్రతం ఆచరిస్తే.. అప్పుల బాధ మటాష్

శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (13:10 IST)
ప్రతి సంవత్సరం మనం గణేశ చతుర్థిని ఘనంగా జరుపుకుంటాం. గణేశ వ్రతం చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆద్మాత్మిక పండితులు అంటున్నారు. గణేశ వ్రతాన్ని గణేశ చతుర్థి నాడు ఆచరించాలి. ఈ వ్రతం చాలా కుటుంబాల్లో అప్పుల బాధల నుంచి విముక్తి పొంది సత్వర ఫలితాలు పొందాయి. గణేశ వ్రతాన్ని ఆచరించడం వల్ల మూడు ప్రధాన ప్రయోజనాలను పొందవచ్చు. 
 
వ్యాపారస్తులు క్రమంగా పురోగతిని చూడగలరు. దాని వల్ల ఏర్పడిన అప్పుల బాధల నుంచి కోలుకోవచ్చు. నిరుద్యోగులకు , చదువు ప్రారంభించే వారికి మొదటి దేవుడు వినాయకుడు. కాబట్టి ఈ గణేశ చతుర్థి రోజున ఉపవాసం వుండటం ద్వారా విద్యాభివృద్ది చేకూరుతుంది. ఉద్యోగ నియామకాన్ని సాధ్యం చేస్తుంది. చిన్నారుల కళల్లో రాణించాలంటే తల్లిదండ్రులు ఈ వ్రతాన్ని ఆచరించాలి.
 
గణేశుడిని ఏ రోజులో ఏ సమయంలోనైనా పూజించవచ్చు. అయితే కొన్ని రోజులలో వినాయక పూజ విశేషాల ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం, చతుర్థి తిథి నాడు ఉపవాసం ఉండి ఆయనను పూజిస్తే సర్వ విధాల ఐశ్వర్యం కలుగుతుంది. 
 
వినాయక చతుర్థి రోజున వరి అన్నంతో పూజించడం, అభిషేకం చేయడం, పేద స్త్రీలకు వీలైనంత దానాలు చేయడం వల్ల వివాహబంధాలు తొలగిపోయి మంచి జీవితం ఉంటుంది.
 
వినాయకుడిని ఐదు రకాల నూనెలతో, నెయ్యితో పంచదీపాన్ని వెలిగించి పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. వినాయగర్ చతుర్థి వ్రతం రోజున వినాయక గాయత్రి మొదలైన వాటిని పఠించి ప్రయోజనం పొందవచ్చు. మంగళవారాలలో సంకష్టహర చతుర్థి శనిప్రదోషం కాబట్టి చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు