వినాయకుని ''చింతామణి గణపతి'' అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (11:46 IST)
ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు ప్రాచీన కాలం నుండి తొలి పూజలు అందుకుంటుంటారు. గణపతి ప్రధాన దైవంగా కొలువైన క్షేత్రాలు మహిమాన్విత క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. ప్రతి ఆలయంలోను వినాయకుడి మూర్తి తప్పకుండా కనిపిస్తుంది. పిల్లలు నుండి పెద్దల వరకు గణపతిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.
 
గణపతి ఆవిర్భవించిన క్షేత్రాలలో మహారాష్ట్ర ప్రాంతంలోని పూణె జిల్లాలోని ధైవూర్ ఒకటి. అష్ట వినాయక క్షేత్రాలలో ఒకటిగా చెప్తున్న ఇక్కడి గణపతిని చింతామణి గణపతిగా భక్తులు పూజిస్తుంటారు. ఈ చింతామణి పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం కపిల మహర్షి దగ్గర కోరికలు నెరవేర్చు చింతామణి ఉండేది. 
 
రాజ వంశానికి చెందిన గణరాజు ఆ చింతామణిని బలవంతంగా తన సొంతం చేసుకుంటాడు. కపిల మహర్షి అభ్యర్థన మేరకు ఆ రాజును గణపతి సంహరించి ఆ చింతామణిని కపిల మహర్షికి అప్పగించాడు. కపిల మహర్షి కోరిక మేరకు గణపతి ఇక్కడ కొలువుదీరాడు. అందువలనే ఇక్కడి స్వామిని చింతామణి స్వామిగా పూజిస్తుంటారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు