వెస్ట్రన్ టాయిలెట్లను ఉపయోగిస్తే అంతే సంగతులు

శుక్రవారం, 23 జూన్ 2023 (16:12 IST)
వెస్ట్రన్ టాయిలెట్లను ఉపయోగించడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వెస్ట్రన్ టాయిలెట్లను ఉపయోగించడం వల్ల పొట్టపై ఎలాంటి ఒత్తిడి పడకపోవడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది. 
 
గ్యాస్ ట్రబుల్, కడుపునొప్పి వచ్చే అవకాశాలు వుంటాయి. అలాగే వెస్ట్రన్ టాయిలెట్లను పబ్లిక్ ప్లేసుల్లో వాడకపోవడం మంచిది. దీంతో యూరినరీ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. మోకాలి నొప్పి బాధితులకు వెస్ట్రన్ టాయిలెట్ చాలా సహాయపడుతుంది. కానీ వాటిని ఉపయోగించడం ద్వారా అనారోగ్య సమస్యలుండవ్. 
 
టాయిలెట్ సీటు నేరుగా శరీరాన్ని తాకుతుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం వుంది. కాబట్టి మీరు వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగించే ముందు కూర్చున్నప్పుడు టాయిలెట్ పేపర్ లేదా టిష్యూ పేపర్‌ని ఉపయోగించాలి. వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగించడం వల్ల మూత్రనాళంలో వాపు, రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. 
 
వైద్యులు ఏమంటున్నారంటే..  కీళ్ల సమస్యలు లేనివారు ఇండియన్ టాయిలెట్లను మాత్రమే ఉపయోగించాలి. ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ టాయిలెట్‌లో మన శరీరం స్క్వాడ్ పొజిషన్‌లో ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి కడుపుని సరిగ్గా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా ఎలాంటి ఇన్‌పెక్షన్స్‌కు దరి చేయవంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు