గోరింటాకు చేతికి పెడితే.. బహిష్ఠు నొప్పులు పారిపోతాయా? (Video)

శుక్రవారం, 5 జూన్ 2020 (18:22 IST)
Henna
ఆయుర్వేదంలో గోరింటాకుకు విశిష్ఠ స్థానం వుంది. పిత్త వ్యాధులను తొలగించే సత్తా గోరింటాకుకు వుంది. శరీరంలో ఏర్పడే అధిక పిత్త సంబంధిత వ్యాధులను గోరింటాకు నయం చేస్తుంది. జుట్టు నల్లగా వత్తుగా పెరగాలంటే గోరింటాకును తప్పక ఉపయోగించాలి. గోరింటాకు రసాన్ని తీసుకుని.. అందుకే కొబ్బరి నూనె కాచి సీసాలో భద్రపరుచుకోవాలి. ఆ నూనెను రోజూ రాసుకుంటూ వస్తే జుట్టు రాలే సమస్యలుండవు. 
 
అయితే దీనికి గోరింటాకు చెట్టును నుంచి తీసిన ఆకులనే వాడాలి. అలాగే గోరింటాకును మహిళలను చేతికి పెట్టుకోవడం ద్వారా శరీర ఉష్ణం తగ్గుతుంది. అలాగే బహిష్ఠు సమయంలో మహిళలకు ఏర్పడే పొట్ట నొప్పి తగ్గిపోతుంది. గోళ్లు శుభ్రంగా వుంటాయి. గోరింటాకు వేళ్ళను కషాయంలా తయారు చేసుకుని తాగితే మహిళల్లో బహిష్ఠు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
చికెన్ ఫాక్స్‌ సమయంలో చర్మానికి, కంటికి ఇబ్బంది కలగుండా వుండాలంటే.. గోరింటాకును బాగా రుబ్బుకుని కాళ్ళకు కట్టడం చేయాలి. జ్వరం వుంటే మాత్రం ఇలా చేయకూడదు. పాదాలకు మేలు చేయాలంటే.. గోరింటాకును రుబ్బుకుని వారానికి ఓసారైనా పాదాలకు రాయడం చేయాలి. 
 
అలాగే గోరింటాకు విత్తనాలను.. సాంబ్రాణి వేసేటప్పుడు ధూపానికి వాడవచ్చు. తద్వారా ఇంట్లోని గాలి శుభ్రం అవుతుంది. ఇంకా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పిత్తంతో ఏర్పడిన తలనొప్పికి గోరింటాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. గోరింటాకు పువ్వులు లేదా విత్తనాలను కషాయంలా తయారు చేసుకుని.. తలకు పట్టిస్తే.. తలనొప్పి వుండదు. నిద్రలేమి పరారవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు