లండన్‌లో యోగా చేస్తున్న కుక్కలు !

లండన్‌లో జంతువులపట్ల ప్రేమతో విడుదల చేసిన ఓ క్యాలెండర్‌ జంతు ప్రేమికులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆ క్యాలెండర్‌‌ను ముద్రించిన నిర్వాహకులు యోగాకు చెందిన వివిధ భంగిమలలో కుక్కల చిత్రాలను ముద్రించి వున్నారు.

న్యూ యోగా డాగ్స్-2010 పేరుతో విడుదలైన ఈ క్యాలెండర్ జంతు ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

టెక్సాస్‌కు చెందిన డ్యాన్, అలెగ్జాండర్ బోరిస్ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ క్యాలెండర్‌ను తయారు చేశారు. వారు రూపొందించిన ఈ క్యాలెండర్‌లో ఉత్తమమైన జాతికి చెందిన కుక్కలను యోగాలోని వివిధ భంగిమలలో ముద్రించడం జరిగింది.

గతంలో అలెగ్జాండర్ యోగా మాస్టరని, అతను తనవద్దనున్న కుక్కలను వివిధ యోగ భంగిమలలో కూర్చోబెట్టేవాడని ఇలాంటి ఆలోచనతోనే డ్యాన్ అలెగ్జాండర్‌ను సంప్రదించాడని, మిగిలినపని ఫోటోషాప్ ద్వారా వారు రూపొందించినట్లు లండన్‌కు చెందిన "ది టైమ్స్" పత్రిక వెల్లడించింది.

తాము రూపొందించిన ఈ క్యాలెండర్ తమకేకాక జంతుప్రేమికుల మనసును కట్టిపడేస్తోందని, వచ్చే సంవత్సరం తాము ఇలాంటి యోగా క్యాలెండర్‌కుగాను పప్పీని ఉపయోగిస్తామని డ్యాన్ తెలిపినట్లు ఆ పత్రిక పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి