వంటికి యోగా మంచిదేగా...

అలుపేలేని జీవితాలు... నిత్యం పని ఒత్తిడి మధ్య నగర బతుకులు. కాసింత వ్యాయామానికైనా టైమ్ దొరుకుతుందా...? అని ఎవరినైనా ప్రశ్నిస్తే... "నిల్" అనే సమాధానమే వస్తోంది. కానీ కుర్చీలకు అతుక్కుపోయి విధి నిర్వహణ చేసేవారు కనీసం యోగా సాధన చేస్తే భవిష్యత్‌లో అనారోగ్య ఇబ్బందుల దరిచేరవు. దీనికి యోగా ఒక్కటే మార్గం అంటున్నారు యోగా నిపుణులు.

వేద కాలానికి ముందే పుట్టిన యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందంటున్నారు. యోగా ఎలా సాధన చేయాలనే అంశంపై ఆయా రంగాల్లో నేడు యోగా నిపుణులు ఉన్నారు. యోగాలో నిష్ణాతులైన యోగా గురువు కమల్ అటువంటి వారిలో ఒకరు. 7 దేశాల్లో శిక్షణలనిస్తున్న ఆయన రాష్ట్ర రాజధాని హైటెక్స్ లో వర్క్ షాప్ నిర్వహించారు. యోగాకు ఉన్న విశిష్టతను వివరించారు.

పారిశ్రామికీకరణ వేగవంతమవుతున్న ప్రస్తుత తరుణంలో యోగా తప్పక సాధన చేయాలని సూచించారు. మన రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో నివశిస్తున్న ప్రజలు ఇప్పుడిప్పుడే యోగా ప్రాధాన్యతను గుర్తించి సాధన చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి