సముద్రయానంలో యోగా

ఈ మధ్య కాలంలో యోగా మనిషి జీవితంలో భాగమైపోతోంది. వివిధ రకాలుగా జనం యోగసాధన చేస్తున్నారు. ఇటీవల 15 దేశాలకు చెందిన 950 మంది యోగ సాధకులు సముద్రంపై తమ సాధనను మొదలు పెట్టారు. ఇక్కడ ధ్యానం మనిషిలో నవయవ్వనాన్ని తెచ్చిపెడుతుందని వారు నమ్ముతున్నారు.

చైనా సముద్ర తీర ప్రాంతాల నుంచి శిబిరాలను నిర్వహిస్తున్నారు. నౌకలపై ప్రయాణం చేస్తూ వారం రోజుల పాటు ఈ సాధన ఉంటుంది. యోగా గరు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరంలో ప్రాణాయామ సాధన చేయిస్తున్నారు. విహారం అంటే బిగ్గరగా వినిపించే సంగీతం, నృత్యాలే కాదని తెలపడం కోసమే ఈ శిబిరాలను నడుపుతున్నట్లు నిర్వాహకులు చెపుతున్నారు.

తన చుట్టూ జరుగుతున్న పరిణామాలతో చాలా ఇబ్బందకర పరిస్థితులను ఎదుర్కొవడానికి యోగా చాలా అవసరం. వాటి ప్రభావంలో జీవితం నలిగిపోకుండా ఉండడానికి యోగా అవసరం. ఇలాంటి పరిస్థితులలో యోగ సాధనలో వివిధ ప్రదేశాలలో ప్రయోగాలు జరుగుతున్నాయి. యోగా అనేది ఏ ఒక్క దేశానికో, జాతికో పరిమితం కాకూడదని యోగ సాధకులు భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి