సీఎం జగన్‌కు కరోనా టెస్ట్ - బ్లీచింగ్ పౌడర్ బాగా పని చేసిందంటూ నటి సెటైర్లు

ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (21:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షా ఫలితాల్లో ఆయనకు నెగెటివ్ అని తేలింది. దీనిపై సినీ నటి కస్తూరి తనదైనశైలిలో సెటైర్లు వేసింది. పారాసిట్మాల్ మాత్రతోపాటు.. బ్లీచింగ్ పౌడర్ బాగా పని చేసిందంటూ వ్యాఖ్యానించారు. 
 
కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్ నిజ నిర్ధారణ కోసం ఇటీవల సౌత్ కొరియా నుంచి లక్ష సంఖ్యల ర్యాపిడ్ యాంటీబాడీ కిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. ఈ కిట్లను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. ఆ తర్వాత ఓ కిట్‌తో కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఈ రిపోర్టు ఫలితం నెగెటివ్ అని తేలింది.
 
దీనిపైనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నటి కస్తూరి కామెంట్ చేసింది. ముఖ్యమంత్రి జగన్‌పై బ్లీచింగ్ పౌడర్‌తో పాటు.. పారాసిట్మాల్ మాత్ర బాగా పని చేసిందంటూ సెటైర్లు వేశారు. ఈమె సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైకాపా శ్రేణులను ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు