వైఎస్సార్సీపీలో చేరిన స్వామిదాస్ దంపతులు

సెల్వి

శుక్రవారం, 12 జనవరి 2024 (10:56 IST)
ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌, ఆయన సతీమణి సుధారాణి గురువారం తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.
 
స్వామిదాస్ 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తిరువూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్‌, ఎం. అరుణ్‌కుమార్‌, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు