ఏపీలో ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్‌

ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (08:27 IST)
అంతర్వేది రథం దగ్ధం ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు.

ప్రార్థన మందిరాల వద్ద నిఘా కొనసాగిస్తూ, సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు. ఆలయాలు, ప్రార్థన మందిరాలతోపాటు పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా నిర్వాహకులు విద్యుత్‌ దీపాలు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని, అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని డీజీపీ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు