విజయవాడలో దుకాణాలకు గ్రీన్ సిగ్నల్.. త్వరలో ప్రకటన

గురువారం, 21 మే 2020 (07:01 IST)
త్వరలో నిబంధనల ప్రకారం విజయవాడ నగర వ్యాప్తంగా దుకాణాలు తెరుచుకోనున్నాయి. కరోనా నిరోధానికి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన  దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు.. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, తదితర అధికారులతో సమావేశమయ్యారు.

సమావేశంలో సెంట్రల్ నియోజవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు  స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. కరోనా నిరోధానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ నేపథ్యంలో విజయవాడ రెడ్ జోన్ ప్రాంతంలో వ్యాపార కార్యక్రమాలకు మార్గదర్శకాలను విడుదల చేయాలని మంత్రి కలెక్టర్ తెలిపారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని నగరపాలకసంస్థ కమిషనర్ కు సూచించారు.

నగరంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయుటకు నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్నా ఖాళీ స్థలం పరిశీలించాలన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు