చంద్రబాబు - పవన్‌లను తిట్టకపోవడం వల్లే టిక్కెట్ ఇవ్వలేదు : వైకాపా ఎమ్మెల్యే వరప్రసాద్

వరుణ్

ఆదివారం, 28 జనవరి 2024 (11:21 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌లను తిట్టక పోవడం వల్లే తనకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ ఇవ్వలేదని వైకాపాకు చెందిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. సర్వేల పేరుతో వైకాపా నేతలు పిల్ల చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసి తీరుతానని చెప్పారు. జగన్‌ను బాబూ అని పిలవడం కూడా తనకు టిక్కెట్ రాకపోవడానికి మరో కారణని చెప్పారు. 
 
తాజాగా ఆయన మాట్లాడుతూ, నియంతృత్వ పోకడలున్న వ్యక్తులు ప్రజలకు తనను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సర్వేల పేరుతో తమషా చేస్తూ రెండుసార్లు తనన పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీచేసి తీరుతానని తేల్చి చెప్పారు. సొంత ఖర్చుతో రాజకీయాల్లో నెగ్గిన తాను లెక్కలేనన్ని అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తిరుపతి ఎంపీ నుంచి గూడురు ఎమ్మెల్యేగా మార్చి తనను వేధించారన్నారు. సర్వేలో తన పరిస్థితి బాగాలేదని తేలిందని, అయినా మీరు నా గుండెల్లో ఉంటారని సీఎం చెప్పారని, తాను ఎవరి గుండెల్లోనో ఉండడానికి రాలేదని, ప్రజల గుండెల్లో ఉండేందుకే వచ్చానని తెలిపారు. ప్రతిపక్ష నేతను బూతులు తిట్టాలని చెబుతుంటారని, తాను ఆ పని చేయకపోవడం వల్లే తనకు టికెట్ రాలేదేమోనని సందేహం వ్యక్తం చేశారు.
 
పార్టీ ఆవిర్భావం నుంచీ జగన్మోహన్ రెడ్డిని తాను బాబు అని పిలిచేవాడినని, సీఎం అయ్యాక కూడా అలాగే పిలవడం కూడా తనను దూరం పెట్టడానికి మరో కారణంగా కనిపిస్తోందని చెప్పారు. సర్వేలో తన పరిస్థితి బాగోలేదని చెప్పారని, కానీ ఆరు నెలల క్రితం ఇప్పుడు సర్వే చేసిన అధికారే 57 మార్కులు ఇచ్చారని గుర్తుచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు