చెన్నై ఓఎంఆర్ రోడ్డులో జగన్ ఇంద్రభవనం.. ఆ ఇంటికి రూ. 122 కోట్ల విలువగల పర్నిచర్: టీడీపీ సంచలన ఆరోపణలు

శనివారం, 18 జులై 2020 (20:29 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. జగన్ చెన్నై ఓఎంఆర్ రోడ్డులో ఇంద్రభవనం నిర్మిస్తున్నారని పేర్కొంది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు శనివారం ప్రకటన విడుదల చేసారు. ఆయన తన లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాలు యధాతథంగా..
 
బాలినేని శ్రీనివాస్ రెడ్డి తరలిస్తున్న నల్లధనం చెన్నైలో ఉన్న జగన్ రెడ్డి కుటుంబ సభ్యుల సూట్ కేసు కంపెనీల కోసమేనా? అందుకేనా నిందితులపై కేసులు పెట్టకుండా దానిని వెలుగులోకి తెచ్చిన సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టడం నల్లధనానికి సూట్ కేసు కంపెనీల బంధం కాదా? 
 
బాలినేని శ్రీనివాస్ రెడ్డి తరలిస్తూ పట్టుబడ్డ నల్లధనంపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదు? చెన్నైలోని జగన్ కుటుంబ సభ్యులకు హవాలా ద్వారా నిధులు తరలిస్తున్నారన్న ఆరోపణలపై ఎందుకు వివరణ ఇవ్వడం లేదు?

వైయస్ కుటుంబ సభ్యులు పేర్లతో చైన్నైలోని ఇంటి అడ్రస్ తో మూడు కంపెనీలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిధులు తరలిస్తున్న విషయం వాస్తవం కాదా? 
కంపెనీ పేరు                                      డైరెక్టర్లు
1. ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వై.ఎస్. భారతి రెడ్డి, వై.ఎస్ సునీల్ రెడ్డి
2. క్వానా ఎగ్జిమ్ ప్రైవేట్ వై.ఎస్. మాలినీ రెడ్డి, వైఎస్ అనీల్ రెడ్డి
3. వర్క్ ఈజ్ స్పేస్ సొల్యూషన్స్ వై.ఎస్. అనీల్ రెడ్డి, వై.ఎస్. సునీల్ రెడ్డి

జగన్ అధికారాన్ని చేపట్టిన తరువాత  వర్క్ ఈజ్ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్   అనే కంపెనీని 20 సెప్టెంబర్ 2019న ఏర్పాటు చేయలేదా? ఈ కంపెనీ రిజిస్టేషన్ కోసం ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మెయిల్ ఐడి  వాడలేదన్న విషయం చెప్పే ధైర్యముందా? 

ఈ కంపెనీలకు బాలినేని శ్రీనివాసరెడ్డి డబ్బు తరలిస్తున్నా విషయం కుండబద్దలయ్యింది. ఈ హవాలా వెనక వైయస్ కుటుంబం ఉండటం సాక్షాధారాలతో సహా బహిర్గతమైంది. సూట్ కేస్ కంపెనీలకు సూట్ కేసులతో కోట్ల రూపాయలు తరలిస్తున్న విషయం చెన్నైలో నిర్ధారణ అయ్యింది.

శాసనసభ్యుల స్టిక్కర్ ఫోర్జరీ చేసిన వ్యక్తిపై ఇంత వరకు ఎందుకు కేసు పెట్టలేదు? చెన్నైకి నల్లధనం తరలిస్తున్న నల్లమిల్లి బాలుపై కేసు పెట్టలేదు. హవాలా కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మంత్రి బాలినేని శ్రీనివాస్  రెడ్డిపై గాని ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డిపై గాని ఇంత వరకు కేసు నమోదు చేయలేదు.

హవాలా కుట్రపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సామన్యులపై కేసులు పెట్టి జైలు పాలు చేశారు. అక్రమంగా నగదు తరలిస్తూ చెన్నైలో పట్టుబడ్డ నల్లమల్లి బాలు ఒంగోలు నగర వైకాప వాణిజ్య విభాగం అధ్యక్షుడిగాను బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ముఖ్య అనుచరుడు కాదా?

రాష్ట్రానికి సంబంధించిన డబ్బు ఎటువంటి పత్రాలు లేకుండా పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లిపోతుంటే కేసు ఎందుకు పట్టించుకోవడం లేదు? తమిళనాడు పోలీసులు పట్టుకోగలిగింది ఏపీలో ఒంగోలు నుంచి తడ వరకు  అక్రమంగా డబ్బు తరలిపోతుంటే ఏపీ పోలీసులు ఎందుకు పట్టుకోలేదు? 

చైన్నైలోని ఓఎంఆర్ రోడ్దులో జగన్ కుటుంబం 60 వేల చదరపు అడుగుల ఇంద్రభవనం నిర్మిస్తున్నారు దానికి బాలినేని డబ్బు తరలిస్తున్నారా? లేక సూట్ కేస్ కంపెనీలకు డబ్బు తరలిస్తున్నారా?

ఆ ఇంటికి రూ. 122 కోట్ల విలువగల పర్నిచర్ ని  నాలుగు లారీల్లో విజయవాడ, హైదరాబాద్ నుంచి తరలించింది వాస్తవం కాదా? లాక్ డౌన్ సమయంలో అత్యవసరంగా పర్నిచర్ తరలించాల్సిన అవసరం ఏంటి? 

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో జగన్ తో పాటు జైలు పాలయ్యిన వై.ఎస్. సునీల్ రెడ్డి, వై.ఎస్. భారతి రెడ్డి లు వర్క్ ఈజ్ సొల్యూషన్ కంపెనీలో డైరెక్టర్లగా ఉన్న విషయం వాస్తవం కాదా?  రాష్ట్రంలో కబ్జాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు పెరిగిపోయాయి. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తూ ప్రజలను హింసిస్తూ దోచుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు