మా చెల్లి కవిత ఓడిపోవడం బాధ కలిగించింది : ఒవైసీ

ఆదివారం, 19 జనవరి 2020 (17:26 IST)
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బహిరంగ సభలో ప్రసంగించారు. భారతదేశ రాజకీయల్లో ముస్లింలపై అణిచివేత ధోరణి మొదలైందని విమర్శించారు ఒవైసీ. పౌరసత్వ సవరణ బిల్లును దళితులు, ముస్లింలు, బడుగుబలహీన వర్గాలవారు కలసికట్టుగా ఉద్యమించాలి అన్నారు. 
 
మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ రాష్టాల్లో మజ్లీస్ పార్టీని ఆదరిస్తున్నారు అని, మహారాష్ట్రలో మజ్లీస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీకి వెళ్లారు అన్నారు. భారతదేశ 130 కోట్ల ప్రజలకు మోడీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంటే మోడీ ప్రభుత్వం పట్టించుకోదు అని విమర్శించారు.
 
హైదరాబాద్ నగరంలో తాము నిర్వహించిన తిరంగా మార్చ్‌లో జాతీయ జెండా పట్టుకుంటే భయపడి పట్టుకున్నామని అంటున్నారు. అయితే మజ్లిస్  పార్టీ ఎవరికీ భయపడదని అన్నారు. జార్కండ్‌లో ఎన్నికల సమయంలో మావోయిస్టుల బెదిరింపులకు పోలీసులు భయపడ్డారు. కానీ మజ్లీస్ తరపున నేను దూసుకుపోయి అక్కడ ప్రచారం చేశానన్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి మా చెల్లి కవిత ఓడిపోవడం బాధ కలిగించిందని ఓవైసీ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు