తుని రైలు కేసులో నిందితులకు సమన్లు: ముద్రగడ సహా పలువురికి రైల్వే చట్టం కింద జారీ

శనివారం, 27 ఫిబ్రవరి 2021 (12:05 IST)
కాపు ఉద్యమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద జరిగిన రైలు దహనం ఘటనలో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులకు శుక్రవారం సమన్లు జారీ అయ్యాయి. 2016 జనవరి 31న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో భారీ బహిరంగ సభ జరిగింది.
 
ఈ సందర్భంగా రత్నచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళనకారులు దహనం చేశారు. దీనిపై అప్పట్లో రైల్వే పోలీసులు ముద్రగడతో పాటు 41 మందిపై రైల్వే చట్టంలోని 146, 147, 153, 174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరంతా మార్చి 3న విజయవాడలోని రైల్వే కోర్టుకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు.
 
వీరిలో ముద్రగడ పద్మనాభం, మంచాల సాయిసుధాకర్‌ నాయుడు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు నమోదు చేసిన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయగా రైల్వే కోర్టు సమన్లు జారీ చేయడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు