యుద్ధాన్ని గెలవడానికి జగన్‌కు బలాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా: ఉండవల్లి

గురువారం, 30 జులై 2020 (17:08 IST)
సీనియర్ రాజకీయ నేత, న్యాయకోవిదుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి పట్ల నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయనకు సూచనలు చేస్తున్నట్లుగా లేఖ రాస్తూనే తనదైన శైలిలో చురకలంటించారు.

ప్రైవేట్ ఆస్పత్రులను కూడా కొవిడ్ పరీక్షలకు అనుమతించి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. ప్రస్తుతం పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు డబ్బు లేదా పలుకుబడి ఉంటే తప్ప కరోనా బారినపడి జీవించలేమని ఆవేదన చెందుతున్నారని తెలిపారు. 

కోవిడ్ రోగులకు తాత్కాలిక సహాయ కేంద్రాలు నడిపేందుకు ఫంక్షన్ హాళ్లను స్వాధీనం చేసుకుని ఎన్జీవోలు, ట్రస్టులకు అప్పగించాలని కోరారు. కోవిడ్ సహాయ కేంద్రాల నిర్వహణ ఖర్చును ఎన్జీవోలు, ట్రస్టులు భరిస్తాయని, ప్రభుత్వం నుంచి డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని అందించాలన్నారు.

రాజమండ్రిలో జైన్ సంఘం ఇప్పటికే అద్దెకు కళ్యాణ మండపం తీసుకొని 60 పడకలతో కరోనా సెంటర్‌ను నడుపుతోందని లేఖలో ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా యుద్ధాన్ని గెలవడానికి సీఎం జగన్‌కు బలాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నానని ఉండవల్లి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు