19-10-2020 సోమవారం రాశిఫలాలు - ఉమాపతిని ఆరాధిస్తే...

సోమవారం, 19 అక్టోబరు 2020 (05:00 IST)
మేషం : ధైర్యంతో ముందడుగు వేస్తే తప్ప అది ఆనందదాయకం కాదు. ఒక కార్యం నిమిత్తం ధనం విరివిగా వెచ్చిస్తారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలు చురుకుగా సాగుతాయి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. 
 
వృషభం : ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శక్తివంచన లేకుండా మీ యత్నాలు సాగించండి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. దాపరికం వల్ల అశాంతి, చికాకులు తప్పవు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. 
 
మిథునం : మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పడం మంచిది కాదు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. వ్యాపారాల్లో పోటీ, షాపు పనివారల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు సెలవులు, మంజూరు కావడం కష్టమే. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. 
 
కర్కాటకం : చెల్లింపులు, కరెన్సీ నోట్లు తీసుకొనే విషయంలో మెళకువ వహించండి. మీ వాహనం పార్కింగ్ చేసే విషయంలో ఇబ్బందులెదుర్కొంటారు. సంగీత, నృత్య కళాకారులకు ప్రోత్సాహకరం. మీ సంతానం విద్యా, ప్రయాణంపై శ్రద్ధ వహిస్తారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికమవుతుంది. 
 
సింహం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బెట్టింగులు, జూదాల వల్ల ఇరకాటంలో పడే ఆస్కారం ఉంది. హామీలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి. పెంపుడు జంతవులు గురించి ఆందోళన చెందుతారు. పాత మిత్రులు, చిన్ననాటి వ్యక్తులు ఆకస్మికంగా తారసపడతారు. 
 
కన్య : వస్తువుల కొనుగోళ్ల వంటి శుభ ఫలితాలున్నాయి. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. నేడు పూర్తి కాని పనులు రేపటికి పూర్తికాగలవు. పత్రికా ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. స్త్రీల మాటకు ఇంటా బయటా మంచి స్పందన లభిస్తుంది. చిన్ననాటి మిత్రులు అనుకోకుండా తారసపడతారు. 
 
తుల : ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటుతగదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
 
వృశ్చికం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. అతిథి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
ధనస్సు : తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు బోనస్, పండుగ అడ్వాన్సులు చేతికందుతాయి. కీలకమైన వ్యవహారాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. మీ ప్రతిభ వెలుగులోకి వచ్చి మంచి విజయం సాధిస్తారు. సోదరీ, సోదరుల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తుతాయి. 
 
మకరం : కొత్త వ్యక్తులకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు టీవీ చానెళ్ల కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. ఏదన్నా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవనోపాధికి సొంతంగా ఏదానా చేయాలి అనే ఆలోచన స్ఫురిస్తుంది. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
కుంభం : స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. ఐరన్, స్టీలు, చెక్క, సిమెంట్ వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిజాలదు. జాగ్రత్త వహించండి. పరస్త్రీలతో సంభాషించునపుడు ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. 
 
మీనం : ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. ప్రయాణాల్లో తొందరపాటు అంత మంచిదికాదు. దైవ కార్యాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడం వల్ల మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధు మిత్రుల రాకపోకలు అధికంగా ఉంటాయి. వైద్యులకు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు