వట్టివేర్లు నానబెట్టిన నీటిని తాగితే ఏంటి లాభం..?

బుధవారం, 29 జులై 2020 (13:13 IST)
Vetiver Roots
వట్టివేర్లలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో వున్నాయి. వట్టి వేర్లను నీటిలో నానబెట్టి ఆ నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. కొన్ని గంటల పాటు వట్టి వేళ్లను గంటల పాటు నానబెట్టి ఆపై వడగట్టి.. ఆ నీటిని తాగేయడమే మంచిది.
 
ఓ మట్టి కుండలో తాగు నీరు పోసి... అందులో వట్టి వేర్లను వెయ్యాలి. వేర్లు నీటిలో పూర్తిగా మునగాలి. ఇలా కొన్ని గంటలు ఉంచాలి. ఆ తర్వాత నీటిని వడగట్టి... ఆ నీటిని తాగేడం మంచిది. 
 
వట్టి వేర్లు నీటిని చల్లబరుస్తాయి. అంతేకాదు... శరీరంలో వేడిని తగ్గిస్తాయి. చలవ చేస్తాయి. ఇవి సహజసిద్ధంగా విషవ్యర్థాలు, విష సూక్ష్మక్రిములతో పోరాడతాయి. శరీరంలో వేడిని తగ్గించడమే కాదు బాడీకి ఉపశమనం కలిగిస్తాయి. మానసికంగా కూడా హాయిగా ఉంటుంది. మెదడుకు ఎంతో మేలు చేకూరుతుంది. 
 
వట్టి వేర్ల నుంచీ వచ్చే తైలం కూడా చాలామంచిది. ఇది విడిగా మార్కెట్లలో దొరుకుతుంది. ఇందులో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. ఈ ఆయిల్‌ని చర్మం, జుట్టుకి వాడినప్పుడు ఇది మొత్తం క్లీన్ చేస్తుంది. నురగలా వచ్చి శుభ్రపడుతుంది. ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు