పండగ సీజన్‌లో ఉల్లి ఘాటు... రైతు బజార్లలో సబ్సీడీ రేట్లతో...

సోమవారం, 26 అక్టోబరు 2020 (17:30 IST)
పండగ సీజన్‌లో ఉల్లి ధరలు మరింతగా పెరిగిపోయాయి. విస్తారంగా కురిసిన భారీ వర్షాల కారణంగా వేసిన పంట పాడైపోవడం, చేతికి రావాల్సిన పంట వర్షాల కారణంగా చెడిపోవడం, దీనికితోడు ఉల్లి డిమాండ్ పెరగడం, దిగుబడి తగ్గిపోవడం కారణంగా ఉల్లి రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం కిలో ఉల్లి వంద రూపాయలకు పైగానే వుంది. దీంతో ఉల్లిని ముట్టుకోవాలంటే మహిళా మణులు వణికిపోతున్నారు.
 
ఈ పరిస్థితిని అంచనా వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఉల్లిగడ్డల ధరను సర్కారు మరో 5 రూపాయలు తగ్గించింది. బయటి మార్కెట్లో కిలో రూ.100కిపైగా ఉండగా, జంట నగరాల్లోని 11 రైతు బజార్లలో ప్రభుత్వం రూ.35కే అందిస్తోంది. శనివారం పలుచోట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు అన్ని రైతు బజార్లలో విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కొక్కరికి 2 కేజీలు ఇస్తామని, వినియోగదారులు ఆధార్‌ కార్డు తీసుకురావాలని స్పష్టం చేశారు.
 
ముఖ్యంగా, ఇటీవల కురిసిన వర్షాలకు కారణంగా మార్కెట్‌లో ఉల్లి ధరలు ఆమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు, పేదలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై ఉల్లిగడ్డలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ రైతుబజార్లలో రూ.35కే  ఉల్లిగడ్డ విక్రయ కేంద్రాలను శనివారం ప్రారంభించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు