ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా ఉన్న కరోనా యాక్టివ్ కేసులెన్ని?

ఆదివారం, 22 నవంబరు 2020 (19:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1121 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా 71,913 కరోనా టెస్టులు నిర్వహించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 164 కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 21 కేసులు గుర్తించారు. 
 
అదేసమయంలో 11 మంది మరణించగా 1,631 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,62,213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,41,026 మంది కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 14,249 మంది చికిత్స పొందుతున్నారు. అటు, మొత్తం మరణాల సంఖ్య 6,938కి పెరిగింది.
 
మరోవైపు, జిల్లాల వారీగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 370, చిత్తూరు 769, ఈస్ట్ గోదావరి 4475, గుంటూరు 1608, కడప 273, కృష్ణ 1978, నెల్లూరు 973, ప్రకాశం 574, శ్రీకాకుళం 454, విశాఖపట్టణం 1253, విజయనగరం 194, వెస్ట్ గోదావరి 1149 చొప్పున కేసులు ఉండగా, మొత్తం 14249 యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఏపీలో ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు