ఎవరికైనా ఫోన్ చేస్తున్నారా? కరోనా కాల్ పలకరిస్తుంది..

శనివారం, 7 మార్చి 2020 (15:18 IST)
కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో.. ప్రభుత్వాలు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నప్పటికీ ఇంకా కొంతమంది సరైన జాగ్రత్తలు పాటించడంలేదు. ఈ కారణంతోనే ప్రస్తుతం మొబైల్ సర్వీస్ ఆపరేటర్లు కూడా ఈ ప్రయత్నంలో భాగం అయినట్లుగా తెలుస్తోంది. మొబైల్ ఫోనులో ఏ కాల్ వచ్చినా వారిని ముందుగా కరోనా కాల్ పలకరిస్తుంది. 
 
కాల్ చేయగానే మొదటి ఒక పొడి దగ్గు... వినిపిస్తుంది. అదేంటి మనం కాల్ చేసిన తర్వాత కనీసం రింగ్ కూడా కాలేదు అప్పుడే కాల్ లిఫ్ట్ చేశాడా అని అనిపిస్తుంది. అయితే ఆ దగ్గు మళ్లీ వెంటనే తగ్గిపోతుంది.. ఆ తర్వాత కరోనా వైరస్ గురించిన హెచ్చరికలు మొదలవుతాయి. కరోనా వైరస్ ఎలా ప్రబలుతోంది కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దగ్గు లేదా తుమ్ము తరచూ వస్తున్న వ్యక్తుల నుంచి కాస్త దూరంగా ఉండటం మేలు అనే సందేశం ఇస్తుంది. 
 
అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని ఇలా కరోనా గురించి కొన్ని సలహాలు వస్తాయి. దీనిని బట్టి మనం ఎవరికీ కాల్ చేసినా కూడా మనకి ముందుగా కరోనా హెచ్చరికలు వినిపిస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు