తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. ముగ్గురు మృతి

మంగళవారం, 17 నవంబరు 2020 (10:37 IST)
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తాజాగా కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 952 కరోనా పాజిటివ్‌ కేసులున్నాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తంగా తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 2.58 లక్షలకు చేరుకున్నాయి. 
 
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనాతో 1,410 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,732 యాక్టివ్‌ కేసులుండగా.. 2.43లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 38,245 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 50 లక్షలకు చేరువైంది. ప్రస్తుతం ఈ సంఖ్య 49,29,974కు చేరుకుంది. ప్రతి 10 లక్షల మంది జనాభాకూ 1,32,454 టెస్టులను నిర్వహించినట్లు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు